Published On: Wed, Jan 9th, 2019

లైట్ ఆటో కంపోనెంట్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీతో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం

* పెట్టుబ‌డులు పెట్టేందుందుకు ముందుకొచ్చిన వైనం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లైట్ ఆటో కంపోనెంట్ ప్రయివేట్ లిమిటెడ్ ఎండీ బాల ఆనంద్ జాలాది, సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, ఎకనమిక్ డెవలప్‌మెండ్ బోర్డ్ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ సమక్షంలో బుధ‌వారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. వాహనాల విడిభాగాల తయారీలో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు లైట్ ఆటో ముందుకు వచ్చింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. మొదటి దశలో రూ.100 కోట్లు, రెండవ దశలో రూ.200 కోట్లు  పెట్టుబడులు పెట్టనున్నారు. ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 350 మందికి ఉపాధి కల్పించనున్నట్టు కంపెనీ ఎండీ తెలిపారు. ప్రధానంగా ఈ కంపెనీలో అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా మెగ్నీషియంతో వాహనాల విడిభాగాలు తయారు చేయనున్నారు. మెగ్నీషియంతో వాహనాల విడిభాగాలు తయారు చేయడం వల్ల వాహనాల బరువు తగ్గడంతోపాటు, ఇంధన సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని కంపెనీ సీఈవో సుభాచరణ్ మీడియాకు వెల్లడించారు.
 

Just In...