Published On: Mon, Jun 10th, 2019

వయోజన విద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ వయోజన విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్ ఆదిమూలపు సురేష్‌ను వెల‌గ‌పూడి సచివాలయంలో సోమ‌వారం కలసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా వయోజన విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ.దేవరకొండ వయోజన విద్య ఉద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దానిపై మంత్రి సురేష్ స్పందిస్తూ తనకు వయోజన విద్యపై మొదటి నుండి ప్రత్యేక శ్రద్ధ వుందని, రాష్ట్రంలో అమలు చేయు అక్షరాస్యతా కార్యక్రమాలపై ప్రత్యెక దృష్టి సారిస్తానని అలాగే వయోజనవిద్య ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిస్కరిస్తానని, నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. మంత్రిని క‌లిసిన వారిలో వయోజన విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ వల్లభనేని, సంయుక్త కార్యదర్శి పోసయ్య పసుపులేటి, ప‌లువురు సంఘ నాయకులు ఉన్నారు.

Just In...