Published On: Fri, Sep 8th, 2017

వార‌స‌త్వ సంప‌ద‌తో యువ‌త‌కు స్ఫూర్తి..

* క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన రాజీవ్ గోళ్ల‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క‌ల్చ‌ర‌ల్‌: చారిత్ర‌క క‌ట్ట‌డాలు, వార‌స‌త్వ స్థ‌లాలు, వ‌ర్ణ‌చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌లు వంటివి సంస్క్ర‌తి ప‌రిర‌క్ష‌ణ‌కు, య‌యువ‌త‌కు స్ఫూర్తిని ఇస్తాయ‌ని అమెరిక‌న్ ఓవ‌ర్సీస్ ప్రెస్‌క్ల‌బ్ యువ జ‌ర్న‌లిస్ట్ అవార్డు గ్ర‌హీత రాజీవ్ గోళ్ల అన్నారు. సెప్టెంబ‌రు 8న (శుక్ర‌వారం) ఆయ‌న విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఆఫ్ విజ‌య‌వాడ, అమ‌రావ‌తిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేసిన వ‌ర్ణ‌చిత్రాలు ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించిన ప‌లు అంశాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను క‌ల్చ‌ర‌ల్‌సెంట‌ర్ సీఈవో డాక్ట‌ర్ ఈమ‌ని శివ‌నాగిరెడ్డి రాజీవ్‌కు వివ‌రించారు. న‌గ‌రానికి చెందిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు గోళ్ల రాధాకృష్ణ‌మూర్తి మ‌న‌వ‌డైన రాజీవ్ గోళ్ల ఫ్రెంచి, స్పానీష్‌, అర‌బిక్ భాష‌ల్లో ప్రావీణ్యం సంపాదించి 19వ ఏట నుంచే అమెరికాలో ఫ్రీ లాన్స్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నార‌ని ఈమ‌ని శివ‌నాగిరెడ్డి తెలిపారు. అమెరికా, కెన్యా, ఉగాంఢా, ఇథోఫియో, ద‌క్షిణ సూడాన్‌, మాలీ దేశాలు దౌత్య సంబంధాల‌పై రూట‌ర్స్‌, ఇరిన్‌, కార‌వాన్ వంటి అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో ప‌రిశోధ‌నాత్మ‌క వ్యాసాల‌ను కూడా రాజీవ్ గోళ్ల రాశార‌ని వివ‌రించారు. కేన‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎథిక్స్, డ్యూకో ఓవ‌ర్సీస్ రీసెర్చ్ త‌దిత‌ర అనేక అవార్డుల‌ను కూడా రాజీవ్ గోళ్ల అందుకున్నార‌ని తెలిపారు. యువ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందిన రాజీవ్ గోళ్ల భార‌తీయ‌, చైనా, ఐరోపా దేశాల మ‌ధ్య గ‌ల త్రైపాక్షిక సంబంధాల‌పై ప్ర‌త్యేక వ్యాసాలు కూడా రాయ‌డం జ‌రిగింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ కార్య‌ద‌ర్శి గోళ్ల నారాయ‌ణ‌రావు, మాల‌క్ష్మీ ప్రాప‌ర్టీస్ సీఈవో సందీప్ మండ‌వ త‌దిత‌రులు పాల్గొన్నారు.

art_gallery_08-09-17_1

Just In...