Published On: Tue, May 14th, 2019

వాస‌వీమాత‌కు భ‌క్తుల నీరాజ‌నాలు..

సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం: ఆర్య‌వైశ్యుల కుల దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ‌వారి ఆలయాల్లో మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. పెనుగొండ‌లోని వాస‌వీ శాంతి థామ్‌లో క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారికి తిల‌క ధార‌ణ మ‌హోత్స‌వాన్ని క‌నుల‌పండువ‌గా నిర్వ‌హించారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌క్తులు దేశం న‌లుమూల‌ల నుండి త‌ర‌లివ‌చ్చారు. ఉదయం ఆలయంలో లలితసహస్రనామార్చన పారాయణం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

Just In...