Published On: Mon, Jun 3rd, 2019

విజయవాడలో అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్‌

* ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు దారి ఇవ్వ‌లేద‌ని మ‌ద్యంమ‌త్తులో హంగామా

* కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: విజ‌య‌వాడ‌లోని భవానీపురం వద్ద హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శ‌నివారం అర్ధరాత్రి ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు హంగామా సృష్టించారు. తెలంగాణలోని నార్కట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తమ ద్విచక్రవాహనాలకు దారి ఇవ్వలేదని సుమారు 50 మంది యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి వద్దకు రాగానే బస్సు బ‌స్సును ఆపి అద్దాలు ధ్వంసం చేశారు. క‌ర్ర‌తో డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేసి టిమ్‌ మిషన్‌, రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనలో యువకులతో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Just In...