Published On: Fri, Sep 8th, 2017

విజయవాడలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

* కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ కోసం విజయనగరం, నెల్లూరు, విశాఖ, యానం జిల్లాల అభ్యర్థులకు శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో ర్యాలీ నిర్వహించబడుతుంద‌ని కృష్ణా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం చెప్పారు. ఈ నె 11న ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థులకు నిర్వహించబడుతుంద‌న్నారు. 17 నుండి 21 ఏళ్ల వయస్సు గల యువత ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనవచ్చ‌ని తెలిపారు. రిక్రూట్‌మెంట్ సమయంలో అభ్యర్ధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామ‌న్నారు. ఉద‌యం 6 గంటలకు అభ్యర్ధులకు పరుగుపందెం నిర్వహిస్తాం అని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎయిర్ ఫోర్స్ ర్యాలీ విజయవాడలోనే నిర్వహించాలని భావించార‌ని వివ‌రించారు. ఎయిర్ ఫోర్స్ ర్యాలీ వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ ర్యాలీ లో పాల్గొనే అభ్యర్థులు ఇంటర్ మీడియట్ విద్యార్హత కలిగి ఉండాల‌ని వెల్ల‌డించారు.

airforce_recrutment_1

Just In...