Published On: Mon, Nov 20th, 2017

విజయవాడలో దద్దరిల్లిన ధర్నాచౌక్‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదాలతో సోమ‌వారం విజయవాడలోని ధర్నాచౌక్‌ దద్దరిల్లింది. ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతుగా వామపక్షాలు, వైకాపా, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. నగరంలోని ధర్నాచౌక్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఆందోళనకారులను భారీగా మోహ‌రించిన పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Just In...