Published On: Fri, Jun 21st, 2019

విజయవాడలో మొదటి సార్ట్ సెంటర్‌ను ప్రారంభించనున్న అమెజాన్.ఇన్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: భారతదేశంలో సార్ట్ సెంటర్ నెట్‌వ‌ర్క్‌ను విస్తరించిన అమెజాన్.ఇన్ ఇప్పుడు విజయవాడలో మొదటిసారి సార్ట్ సెంటర్ ప్రారంభిస్తున్నారని అమెజాన్ ఇండియా మిడిల్ మైల్ ట్రాన్స్‌పోర్టేషన్ డైరెక్టర్ అభినవ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం విజ‌య‌వాడ‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌  మార్కెట్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న అమెజాన్.ఇన్ ఈ ఏడాది నూతన సార్ట్ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఇప్పటివరకు రాంచి, గోవా, సిలిగురిలో కలిపి మూడు వ్యాపార కేంద్రాలతో ఉన్న అమెజాన్ ఇప్పుడు విజయవాడలో కూడా వ్యాపార కేంద్రాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ వ్యాపార కేంద్రాల వల్ల కొనుగోలుదారులకు అమెజాన్‌లో ఆర్డర్లను ఇస్తే వేగవంతమైన డెలివరి పొందేందుకు ఈ విస్తరణ ఉపయోగపడుతుందన్నారు.

Just In...