Published On: Wed, Jan 8th, 2020

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఉద్రిక్తత

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: బెంజ్‌ సర్కిల్‌లో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు, జేఏసీ నేతలు ఆటోనగర్ ప్రాంతానికి పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు అమరావతి జేఏసీ బస్సులను పోలీసులు ఆపేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. పాదయాత్రను ఉపసంహరించుకోవాలని నేతలను పోలీసులు కోరారు.

చంద్రబాబు ఆగ్రహం
‘ఎందుకీ దౌర్జన్యం.. పోలీసుల దమనకాండ. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాజధానిని ఏం చేయాలనుకుంటున్నారు. మేం చట్ట ప్రకారం పర్మిషన్‌ తీసుకున్నాం.. కానీ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Just In...