Published On: Tue, Apr 16th, 2019

విజయసాయిరెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్..

* తాడేపల్లి పీఎస్‌లో కేసు నమోదు

సెల్ఐటి న్యూస్‌, తాడేపల్లి: వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. 9618729089, 9538362525, 8247662578, 8886059309 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనల మేరకు మంళ‌వారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Just In...