Published On: Thu, Jul 2nd, 2020

విజయ సూపర్ స్పెషాలిటీలో అత్యాధునిక డ‌యాల‌సిస్ యూనిట్లు

* 22 డయాలసిస్ యూనిట్లతో నెలకు 2వేల డయాలసిస్ సెషన్ల సౌకర్యం

* ఒకేచోట నెఫ్రాలజీ, యూరాలజీ సేవలు

* తాజాగా 6 డయాలసిస్ యూనిట్లు ప్రారంభం

* నవ్యాంధ్రలో అత్యధిక డయాలసిస్ యూనిట్లు కలిగిన హాస్పిటల్‌గా విజయ సూపర్ స్పెషాలిటీ

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విభాగమైన డాక్టర్ శరత్స్ అడ్వాన్స్డ్ కిడ్నీ ఇనిస్టిట్యూట్ నందు 22 అత్యాధునిక డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. నూతనంగా ఏర్పాటుచేసిన ఆరు డయాలసిస్ మిషన్లను డాక్టర్ శరత్ బాబు మాతృమూర్తి జి.విజయలక్ష్మి ప్రారంభించారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆరు మిషన్లతో నవ్యాంధ్రలొనే అత్యధిక డయాలసిస్ యూనిట్లు కలిగిన వైద్యసంస్థగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన ఘనతను సాధించింది. అందుబాటులో ఉన్న 22 మిషన్ల ద్వారా నెలకు రెండువేల డయాలసిస్ సెషన్లు నిర్వహించేందుకు వీలుందని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈవో, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్ బాబు తెలిపారు. నూతన డయాలసిస్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ హాస్పిటల్ నందు అత్యాధునిక నెఫ్రాలజీ, యూరాలజీ సేవలను ఒకేచోట అందిస్తున్నామని అన్నారు. 24 గంటల నిరంతర హీమో డయాలసిస్ సేవలతో పాటు, కిడ్నీ మార్పిడి చికిత్సల కోసం నెఫ్రో ట్రాన్స్ప్లాంట్ ఐసీయూని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. నిష్ణాతులైన వైద్య బృందం ద్వారా అనేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ క్లినిక్, డయాబెటిక్ కిడ్నీ డీసీజ్, కిడ్నీ బయాప్సి, మూత్రపిండాలలో రాళ్లు, ప్రొస్టేట్ మూత్రనాళ సమస్యలు, ఉబ్బు కామెర్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర చికిత్సలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యాధునిక నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యసేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ జి.శరత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఛైర్మన్ జి.వెంకటరావు, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ జి.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Just In...