Published On: Thu, Sep 7th, 2017

విజిలెన్స్‌ అధికారుల దాడులు.. కల్తీ నెయ్యి స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు డెస్క్‌: గుంటూరు జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు బుధవారం దాచేపల్లిలో ఆకస్మిక దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో భాగంగా స్థానికంగా ఉన్న నెయ్యి తయారీ కేంద్రంలో తనిఖీలు చేప‌ట్టి నెయ్యి డబ్బాలను పరిశీలించారు. వాటిలో కల్తీ ఉందని గుర్తించారు. వెంటనే దాదాపు రూ.లక్ష ఖరీదు కలిగిన డబ్బాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ సీఐ ఆంటోనిరాజు, ఏఓ వెంకట్రావు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Just In...