Published On: Sat, Dec 14th, 2019

విజ‌య‌వాడ‌లో ఆకృతి వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న…

* ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వ‌హ‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌గ‌ర‌వాసుల కోరిక మేర‌కు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్ర‌ప్ర‌దేశ్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని శేష‌సాయి క‌ల్యాణ‌మండ‌పంలో ఈ నెల 16, 17 తేదీల్లో ఆకృతి చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేస్తున్న‌ట్లు క్రాఫ్ట్స్ కౌన్సిల్ నిర్వాహ‌కులైన మ‌హిళా ప్ర‌తినిధులు రంజ‌న‌, జ‌య‌శ్రీ, సుజాత‌, ర‌ష్మి తెలిపారు. బెంజిస‌ర్కిల్ స‌మీపంలోని ఎస్‌.వి.ఎస్‌. క‌ల్యాణమండ‌పంలో శ‌నివారం ఉద‌యం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి స్వ‌యంగా క‌ళాకారులు త‌యారుచేసి విక్ర‌యించే చేనేత వ‌స్త్రాలు, మ‌న సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌కు చిహ్న‌మైన వివిధ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌యాలు అందుబాటు ధ‌ర‌ల్లో విక్ర‌యిస్తార‌ని చెప్పారు. శేష‌సాయి క‌ల్యాణ‌మండ‌పంలో రెండు రోజుల‌పాటు జ‌రిగే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాల‌లో సుమారు 60 స్టాల్స్ ఉంటాయ‌న్నారు. ఉద‌యం 10:30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న, అమ్మ‌కాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. న‌గ‌ర‌వాసులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున సామాజిక బాధ్య‌త‌గా అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని వారు వెల్ల‌డించారు.

Just In...