Published On: Sat, Jan 4th, 2020

విజ‌య‌వాడ‌లో ఈ నెల 13 వరకు “గాంధీ శిల్ప్ బజార్” 2020

* గ్రామీణ కళ, సాంస్కృతిక రూపాలపై ప్రజలకు అవగాహన కల్పించండి

* హస్తకళలు, చేతివృత్తులను ప్రోత్సహించి సంరక్షించండి

* విజ‌య‌వాడ మ‌ధ్య‌నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్న హస్త, చేనేత కళల వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉన్నాయ‌ని, ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని విజ‌య‌వాడ మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గం శాసన సభ్యులు మల్లాది విష్ణు కోరారు. మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శనివారం గాంధీ శిల్ప బజార్-2020ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజ‌రై  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ గ్రామీణ ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం యొక్క పురాతన మరియు వైవిధ్యమైన కళలు, చేతిపనులు, లలిత కళలు, ఇతర సాంస్కృతిక అంశాలపై ప్రాచుర్యం కల్పించేలా శిల్పారామం కృషి చేస్తోందన్నారు. మన జాతీయ హస్తకళలు మరియు చేతివృత్తులను ప్రోత్సహించండంలో మరియు సంరక్షించండంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. తమ కళాఖండాలను ప్రజలకు విక్రయించడానికి ప్రత్యక్ష మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందించడం జరిగిందని, తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేస్తున్న ట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లు, మేళాలు నిర్వహించడం ద్వారా, శిల్పారామం పార్కుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ కళ మరియు సాంస్కృతిక రూపాల గురించి ప్రజలకు మరింత గా అవగాహన కల్పించండం జరుగుతుంద‌న్నారు. అధికారులు ఆదిశలో ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మన పురాతన సాంస్కృతిక వారసత్వాన్ని సాధ్యమైన మేర కాపాడి వాటిని భవిష్యత్ తరాలకు అందించడానికి, ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పూర్తి స్థాయిలో శిల్పారామం వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో చేనేత, హస్త కళల పునరుద్ధరించడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. అదే విధానంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రోత్సాహకాలు అందిస్తారని పేర్కొన్నారు. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 60 మంది హస్త, చేనేత వృత్తి కళాకారులు వారు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకానికి పెట్టారన్నారు. దేశంలోని పేరున్న ఉత్పత్తులు ఒకేచోట కొలువు తీరాయని, ప్రజలు సద్వినియోగం చేసుకుని, వారిని ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శిల్పరామం పార్కులను ఏర్పాటు చేయడానికి సొసైటీ చర్యలు ప్రారంభించిందని శిల్పారామం సీఈఓ జయరాం తెలిపారు. రాష్ట్రంలోని కళలు, చేతిపనులు మరియు ఇతర సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టండం జరుగుతుంద‌న్నారు. శిల్పారామం సొసైటీ ద్వారా ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, కడప వద్ద 8 శిల్పారామం పార్కులను ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బొప్ప‌న భవకుమార్, జనరల్ మేనేజర్ భక్త, అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్, జాతీయ అవార్డ్ గ్రహీత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Just In...