Published On: Tue, Jun 12th, 2018

విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా ఉరుసు మ‌హోత్స‌వం

* ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేసిన సీపీ గౌతం స‌వాంగ్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ భ‌వానీపురంలో హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ అవులియా వారి 430వ‌ ఉరుసు (గంధం) మహోత్సవం సోమ‌వారం సాయంత్రం వైభ‌వంగా జ‌రిగింది. ఉరుసు మ‌హోత్స‌వానికి న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ డి.గౌతం స‌వాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొని రంజాన్ పండ‌గ పుర‌స్క‌రించుకుని ముస్లీం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ముస్లీం మ‌త పెద్ద‌లు, ద‌ర్గా ముజావర్ల మేనేజింగ్ కమిటీసభ్యుల‌తో క‌లిసి ఆయ‌న భ‌వానీపురం ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. రంజాన్ మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక అని సీపీ గౌతం స‌వాంగ్ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ సంయుక్త పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా, డీసీపీ-2 ఇన్‌ఛార్జ్ నావ‌బ్ జానీ, ఇన్‌ఛార్జ్ ట్రాఫిక్ డీసీపీ టి.రామ‌న‌ప్ర‌సాద‌రావు, ట్రాఫిక్ ఏడీసీపీ నాగ‌రాజు, ముస్లీం మ‌త పెద్ద‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...