Published On: Fri, Jan 25th, 2019

విజ‌య‌వాడ‌లో ది యు.ఇ. జ్యూయ‌ల‌రీ ఎక్స్‌పో ప్రారంభం

* ఆక‌ట్టుకుంటున్న వ‌జ్రాభ‌ర‌ణాలు, ఫ్యాష‌న్ జ్యూయ‌ల‌రీ 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: యునైటెడ్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ది యు.ఇ. జ్యూయ‌ల‌రీ ఎక్స్‌పో ఆభ‌ర‌ణాల ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న విక్ర‌యాలు న‌గ‌రంలోని మున్సిప‌ల్ కాల‌నీలో ఉన్న ఎ+ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో శుక్ర‌వారం నుండి ప్రారంభ‌మ‌య్యాయి. న‌గ‌ర ప్ర‌ముఖులు లింగ‌మ‌నేని ప్ర‌శాంతి, నార్ల భ‌వానీ, గోళ్ల సంధ్య‌, కృష్ణాజీ త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా హాజ‌రై జ్యూయ‌ల‌రీ ఎక్స్‌పో ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌యాల‌ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ప్ర‌ద‌ర్శ‌న కేవ‌లం వ‌జ్రాభ‌ర‌ణాల‌కే ప‌రిమితం కాద‌ని అనేక ర‌కాల ఆభ‌ర‌ణాలు కొలువుదీరాయ‌న్నారు. తేవా, మీనాకారి, పోల్కా, కుంద‌న్‌, యాంటిక్ వంటి విలువైన మ‌రియు పాక్షిక విలువైన స్టోన్ న‌గ‌లు, జెమ్‌సెట్ జ్యూయ‌ల‌రీ, రంగురాళ్ల ఆభ‌ర‌ణాలు, బీడ్స్‌, ముత్యాలు, ప‌గ‌డాలు, అమెరిక‌న్ డైమండ్ సెట్స్‌, ఫ్యాష‌న్ జ్యూయ‌ల‌రీ, సిల్వ‌ర్ అండ్ డైమండ్ గిఫ్ట్స్‌ ఆర్టిక‌ల్స్‌తో పాటు వివాహాది శుభ‌కార్యాల‌కు ప్ర‌త్యేక ఆభ‌ర‌ణాలు ప్ర‌ద‌ర్శ‌న‌లో ల‌భిస్తాయ‌న్నారు. పురుషులు, పిల్ల‌ల‌కు కావాల్సిన విశిష్ట‌మైన జ్యూయ‌ల‌రీ క‌లెక్ష‌న్స్‌ ప్ర‌ద‌ర్శ‌న‌లో అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. ది యు.ఇ. జ్యూయ‌ల‌రీ ఎక్స్‌పో కేవ‌లం భార‌తదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఎగ్జిబిష‌న్‌ల‌ను నిర్వ‌హిస్తుంద‌ని యునైటెడ్ ఎగ్జిబిష‌న్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌, ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ వి.కె.మ‌నోజ్‌కుమార్ చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి గాంచిన 70 మందికి పైగా ఆభ‌ర‌ణాల త‌యారీదారులు మ‌రియు రిటైల‌ర్స్ ఈ ఎక్స్‌పోలో పాల్గొన్నాయ‌ని తెలిపారు. ప్ర‌ద‌ర్శ‌న ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. న‌గ‌ర‌వాసులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నిర్వాహ‌కులు కోరారు.
 

Just In...