Published On: Mon, Dec 3rd, 2018

విజ‌య‌వాడ‌లో నేటి నుండి ఆకృతి వస్త్ర‌ ప్రదర్శన

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: క్రాప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో నగరంలోని మ‌హాత్మాగాంధీ రోడ్డులోని చెన్నుపాటి పెట్రోల్ బంకు స‌మీపంలో ఉన్న ఎస్‌.ఎస్‌. కన్వెన్షన్ హాల్‌లో ఆకృతి వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రంజన, జయశ్రీ తెలిపారు. ఈ విష‌య‌మై ఎస్‌.ఎస్‌.క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల నమావేశంలో వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా క్రాప్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఏటా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వస్త్ర ప్రదర్శనతో పాటు సుమారు 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆయా ఉత్ప‌త్తిదారులు పాల్గొని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, చేనేత వస్త్రాలు త‌దిత‌ర స్టాల్స్  ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ప్రదర్శనతో పాటు విక్ర‌యాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రదర్శనను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రాష్ట్ర మహిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ న‌న్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభిస్తారని తెలపారు. విలేక‌రుల స‌మావేశంలో ప్రదర్శన కన్వీనర్ సుజాత, క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

Just In...