Published On: Thu, Nov 8th, 2018

విజ‌య‌వాడ‌లో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: విజయవాడ దుర్గాపురంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో గురువారం ఉద‌యం పట్టపగలే చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు రాణి అనే మహిళను బంధించారు. కత్తులతో బెదిరించి నగలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరిని పట్టుకోగా.. మిగిలిన ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమేరాల ద్వారా జ‌రిగిన వ్య‌వ‌హారాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.

Just In...