Published On: Sat, Nov 23rd, 2019

విజ‌య‌వాడ‌లో యు.జి. జ్యూయలరీ ఎక్స్‌పో ప్రారంభం…

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పండుగలు, వివాహాది శుభకార్యాల సందర్భంగా విజ‌య‌వాడ నగరంలో ఏర్పాటు చేసిన యు.ఇ. జ్యూయలరీ ఎక్స్‌పో ప్రదర్శన మున్సిప‌ల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లోశుక్ర‌వారం ఉద‌యం  ప్రారంభమైంది. ప్రదర్శనను కె.ఎల్. విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ కోనేరు కాంచన , సిద్దార్ధ మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి.విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఆభరణాలు అందించేందుకు ప్రముఖ జ్యూయలరీ షోరూమ్‌లు అన్నీ ఒకేచోట ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రానున్న పండుగలు, వివాహది శుభకార్యాలకు ఉపయోగించుకునేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యునైటెడ్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.కె.మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రదర్శన‌లో తేవా, మీనాకారి, పోల్కా, కుందన్, యాంటిక్ విలువైన, పాక్షిక విలువైన స్టోన్ నగలు, జెమ్‌సెట్ జ్యూయలరీ, రంగురాళ్ల ఆభరణాలు, బీడ్స్, ముత్యాలు, పగడాలు, అమెరికన్ డైమండ్స్ ఉంటాయన్నారు. ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు. మహిళల కోసమే కాకుండా పురుషులకు, పిల్లలకు కావాల్సిన విశిష్ట రకాల జ్యూయలరీ కలెక్షన్ ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 70 మందికి పైగా ప్రఖ్యాతిగాంచిన ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో లయోలా వాకర్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అట్లూరి కుమారి, ధనలక్ష్మి, పి.వాణి కృష్ణాజీ, ఎ ప్లస్ కన్వెన్షన్ డైరెక్టర్ చిలకపాటి ఉషారాణి పాల్గొన్నారు.

Just In...