Published On: Sat, Apr 4th, 2020

విజ‌య‌వాడ‌లో రెండు మెడిక‌ల్ స్టోర్ల‌పై కేసులు న‌మోదు

* విజ‌య‌వాడ‌లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ ఐజీ నేతృత్వంలో ఆక‌స్మిక త‌నిఖీలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: క‌రోనా వైర‌స్ నేప‌ధ్యంలో లాక్‌డౌన్ జ‌రుగుతున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తూనికలు, కొలతల్లో అవకతవకలు జరుగకుండా శాఖాప‌రంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోజువారీ తనిఖీలలో భాగంగా శ‌నివారం విజ‌య‌వాడ రైతుబ‌జార్లు, జ‌న‌ర‌ల్ స్టోర్లు, మెడిక‌ల్ షాపుల్లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ కంట్రోల‌ర్ డాక్ట‌ర్ యం.కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సింగ్‌న‌గ‌ర్‌లోని మాకినేని బసవయ్య పున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ల దుకాణాల వ‌ద్ద రైతులు ఉపయోగించే తూనిక యంత్రాల‌ను, శాఖాప‌రంగా వేసిన ముద్ర‌ల‌ను త‌నిఖీ నిర్వ‌హించారు. అలాగే జనరల్ స్టోర్ల‌, చౌకధరల దుకాణాలు సందర్శంచి వారు ఉపయోగించే తూనిక యంత్రముల యెక్క ఖచ్చితత్వమును మరియు డిపార్టుమెంటు వారిచే వేయబడిన ముద్రలను తనిఖీ చేశారు. మెడికల్ స్టోర్లు (సర్టికల్స్) తనిఖీ చేయగా, లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారం ఉండాల్సిన డిక్లరేషన్స్ లేక‌పోవ‌డంతో పాటు మాస్కుల ప్యాకేజ్‌లు మరియు శానిటైజర్స్ లిక్విడ్స్‌పై ఉన్న ధ‌ర కంటే అద‌నంగా విక్ర‌యిస్తున్న దుకాణాల‌ను గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా లాక్‌న్ వ‌ల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు, నిర్ణీత ధరలకన్నా అధికంగా విక్ర‌యించినా, తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులు, చౌకధరల దుకాణపు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అలాగే ప్యాకేజ్డ్‌ పాలు మరియు పాల పదార్థాల‌ను ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్ర‌యిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. తనిఖీలలో భాగంగా అసిస్టెంట్ కంట్రోలర్-1 పి.స్వర్ణ, ఇన్‌స్పెక్టర్ పి.హెచ్.వాసుదేవరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Just In...