Published On: Wed, Mar 20th, 2019

విజ‌య‌వాడ‌లో రెస్టారెంట్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

* బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన రూ.78 ల‌క్ష‌లు విలువైన మ‌ద్యం స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం:  విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని టిక్కిల్‌రోడ్డులో బే లీవ్స్ కిచెన్ రెస్టారెంట్‌పై మాచ‌వ‌రం పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా మంగ‌ళ‌వారం రాత్రి దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో ఎటువంటి బిల్లులు లేకుండా సుమారు రూ.78 ల‌క్ష‌లు విలువైన 10 ర‌కాల కంపెనీల‌కు చెందిన నిల్వ ఉంచిన‌ మ‌ద్యం బాటిల్స్‌ను నిల్వ ఉంచిన‌ట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.వి.శ్రీనివాస‌రావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మ‌ద్యం సీసాల‌ను మాచ‌వ‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు.

Just In...