Published On: Sat, Apr 4th, 2020

విజ‌య‌వాడ‌లో విజ‌య‌వంతంగా రూ.1000 ఆర్థిక సాయం…

* మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌కటించిన విధంగా నగరంలో తెల్లరేషన్ కార్డ్ ఉన్న వారికీ ఆర్ధిక సాయం రూ.వెయ్యి పంపిణి కార్యక్రమం విజయవంతంగా  చేపట్టడం జరుగుతోంద‌ని విజ‌య‌వాడ మున్సిప‌ల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగర పరిధిలో మొత్తం 1,74,082 మంది లబ్ధిదారులకు రూ.వెయ్యి ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుంద‌న్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం తప్పనిసరిగా అమలులో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.1000 అందజేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నగర పరిధిలోని లబ్దిదారులందరికి నగదు పంపిణి కార్యక్రమాన్ని ఉదయం నుంచి వార్డ్ వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది ద్వారా చెప్పట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం విజయవాడ నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు.  ప్రభుత్వం ప్రకటించిన విధంగా సామాజిక దూరాన్ని పాటించే క్రమంలో డిజిటల్ విధానంలో లబ్ధిదారుల ఫోటోను క్యాప్చర్ చేసి నగదు మొత్తాన్ని వాలంటీర్ల అందిస్తున్నార‌ని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ భరోసా పింఛన్లు, రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం, కందిపప్పు త‌దిత‌ర నిత్యావ‌స‌రాల‌కు అదనంగా ప్రభుత్వం వెయ్య రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకు  ప్రజలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఇందులో భాగంగానే నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్  సూచనల మేరకు నగరపాలక సంస్థ ప్రాజెక్ట్ అధికారి ఐ.విజయలక్ష్మి ఆధ్వర్యంలో వార్డ్  సచివాలయాల వారిగా లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలు మ్యాపింగ్ చెయ్యడం జరిగిందని అదనపు కమిషనర్ (జనరల్) ఎ.మోహనరావు తెలిపారు. ఆ ప్రకారం నిర్వహించిన ప్రణాళికలు మేరకు ప్రతి వార్డు వాలెంటరీ వారికీ కేటాయించిన ప్రాంతాలలో వార్డు కార్యదర్శి మరియు ఇతర సిబ్బంది, సమన్వయ అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్దిదారులకు రూ.1000 నగదు రూపేణా అందించడం జరుగుతుంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరాన్ని పాటిస్తూ జి.పి.ఎస్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుని ఫోటో తీసి, జియో ట్యాగింగ్ చేయుడం జరిగిందన్నారు.  నగరంలోని 1వ డివిజన్ గుణదల ప్రాంతంలో అదనపు కమిషనర్ (జనరల్) ఎ.మోహనరావు పాల్గొని వార్డు వాలెంటరీలతో కలసి లబ్దిదారులకు నగదు సహాయం అందచేశారు.

Just In...