Published On: Thu, Apr 12th, 2018

విజ‌య‌వాడ‌లో వీఎల్ఎన్ షాపింగ్ మాల్‌..

* లాంఛ‌నంగా ప్రారంభించిన ప్ర‌ముఖ సినీ నటి ప్రణిత 

* కొనుగోలుదారుల‌తో సరదాగా గడిపిన బ్యూటీక్విన్ 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: న‌గ‌రంలోని స్టెల్లా కళాశాల స‌మీపంలోని సాయిబాబా గుడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వీఎల్ఎన్ షాపింగ్ మాల్‌ను బుధవారం ఉద‌యం ప్రముఖ సినీ నటి ప్రణీత ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా షాపింగ్ మాల్‌కు వ‌చ్చిన కొనుగోలుదారుల‌తో ఆమె కాసేపు సందడిగా గడిపారు. అనంత‌రం ప్రణిత మాట్లాడుతూ విజయవాడ చాలా బాగుంద‌ని, అమ‌రావ‌తి రాజ‌ధాని అయిన త‌రువాత ఇక్క‌డ‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. విజయవాడ మహిళలు చీరెలు అంటే ఎంతో ఇష్టపడతార‌ని, అందుకే వీఎల్ఎన్ షాపింగ్ మాల్ అధినేతలు వివాహాలకు కట్టుకునే పట్టుచీరెలపై ప్ర‌త్య‌క శ్రద్ద తీసుకొని సొంతగా నేచిన‌ ప్రత్యేక పెళ్ళిపట్టు చీరెలను నగరవాసులకు అందించడం అభినందనీయమన్నారు. త్వరలో తెలుగు సినిమాలో నటిస్తున్న‌ట్లు తెలిపారు. కుటుంబకథా చిత్రం కావడంతో తాను నటించడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. షోరూం అధినేతలు వల్లంకొండ రామకృష్ణ, వల్లంకొండ కృష్ణకాంత్, వల్లంకొండ నీరజ్‌లు మాట్లాడుతూ వ‌స్త్ర రంగంలో తమ అనుభవాన్ని నూతన రాజధాని ప్రజలకు అందించ‌డం కోసం సరికొత్త వెరైటీలు అందించాలనే దృక్పధంతో షాపింగ్ మాల్‌ను ప్రారంభించామ‌న్నారు. పెళ్ళి పట్టు చీరెలు, హై ఫ్యాన్సీ చీరెలు తమ షోరూం ప్రత్యేకతని తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో వ‌ర్క్, బెనారస్, సింథటిక్, కాటన్, ఫ్యాన్సీ చీర‌ల‌తో పాటు సూపర్నెట్ శారీస్, కళంకారి చీర‌లు, హ్యాండ్‌మేడ్ శారీస్ ల‌భిస్తాయ‌న్నారు. మొదటి అంతస్తులో పట్టు చీరెలు, ప‌ట్టు  లంగాలు, హై ఫ్యాన్సీ చీరెలు, హ్యాండ్లూమ్ శారీస్, బ్రైడల్ శారీస్ కౌంటర్స్‌ను, రెండో అంతస్తులో డ్రస్ మెటీరియల్స్, లెహంగాస్‌, చుడిదార్స్‌, కుర్తిస్‌, లెగ్గిన్స్, లాంకాళీస్‌తో పాటు రేమాండ్, రీడ్ అండ్ ట్రైలర్, సియారామ్స్, అరవింద్, లెనిన్ వంటి ప్రముఖ కంపెనీల సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ల‌భిస్తాయ‌న్నారు. నేటి యువత అభిరుచికి తగ్గట్లుగా డిజైన్లు, రంగులు వేలాదిగా అందుబాటులో ఉంచామ‌న్నారు. వినియోగదారుల సౌకర్యార్థం కొనుగోలు ధరలపై స్వల్ప లాభంతో వస్త్రాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో వల్లంకొండ రామ్మోహనరావు, ప‌లువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
 

Just In...