Published On: Mon, Jul 15th, 2019

విజ‌య‌వాడ‌లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్

* ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా బుర్జ్ ఖలీపా ట‌వ‌ర్‌

* చిన్నారుల‌కు వినోదం అందించేందుకు ఎమ్యూజ్‌మెంట్ రైడ్స్ సిద్ధం

* 60 రోజుల పాటు న‌గ‌ర‌వాసుల‌కు ఆహ్లాదం.. ఆనందం పంచ‌నున్న ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాలు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదం, ఉల్లాసం క‌ల్గిస్తూ ఆనందంగా గడిపేందుకు పలు వేదికలు సిద్ధమయ్యాయి. విజయవాడ వాసులను అలరించేందుకు న‌గ‌రంలోని స్వ‌రాజ్య‌మైదానంలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. సోమ‌వారం నుంచి ఈ ఎగ్జిబిష‌న్ పూర్తిస్థాయిలో న‌గ‌ర‌వాసుల సంద‌డితో అల‌రించ‌నుంది. సాయంత్రం సమయాల్లో కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుగా ఇందులో లేటెస్ట్ ఎమ్యూజ్యెంట్ రైట్స్‌ను ఇక్క‌డ అనేకం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా స్కీమ్లవర్, సునామీ రైడ్స్‌ను తొలిసారిగా ఇందులో ఏర్పాటు చేయడం విశేషం. ఇక చిన్నారుల కోసం జెయింటివీల్, రిప్లికా, స్నోవరల్డ్, ట్రైన్ వంటి ఎన్నో రకాల రైడ్స్ ఇందులో ఏర్పాటయ్యాయి. మహిళలు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా దుస్తులు, జ్యుయలరీ, చెప్పులు, అలంకరణ వస్తువులు, అన్నిరకాల ఫుడ్ స్టాల్స్, గృహాలంకరణ ఉత్పత్తులు ఇలా పలు రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ విజయవాడ వాసులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఆదివారం, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రదర్శన జరుగుతుంది. 200 పైగా స్టాల్స్‌తో 60 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ బెజవాడ వాసులకు అందుబాటులో ఉంటుందని హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ నిర్వాహకులు ఎం.రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల పాటు విశేష అనుభవంతో విజయవాడలో 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఏటా ఏదో ఒక కొత్త ఆకర్షణతో తమ ప్రదర్శన ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద టవర్‌గా చెప్పే బుర్జ్ ఖలీపా ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో అమర్‌నాథ్ యాత్ర, తాజ్‌మ‌హ‌ల్, సెవన్ వండర్, స్నోవరల్డ్, లైట్ హౌస్ ఇలాంటి న‌మూనాల‌ను ప్రజలకు అందించామని చెప్పారు. దక్షిణాదిలోని అన్నిముఖ్య నగరాల్లో తాము ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నగరంలోని స్కూలు పిల్లలు విహారయాత్రలాగా గ్రూప్‌గా ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు వస్తే వారికి ప్రత్యేకమైన రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200మంది కళాకారులు ఎంతో శ్రమించి ఈ ప్రదర్శనను తీర్చిదిద్దినట్లు ఎగ్జిబిషన్ మేనేజర్ విజయపాల్ వెల్లడించారు. ఈ ప్రదర్శన ద్వారా ప్రత్యక్షంగా 200మందికి, పరోక్షంగా 500మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు.

Just In...