Published On: Mon, Aug 21st, 2017

విజ‌య‌వాడ గేట్‌వే హోట‌ల్‌లో త‌మిళ‌నాడు రుచులు సిద్ధం

సెల్‌ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: భోజ‌న‌ప్రియుల కోరిక మేర‌కు నోరూరించే త‌మిళ‌నాడు సంప్ర‌దాయ వంట‌కాల‌ను ప‌రిచ‌యం చేస్తూ డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను సోమ‌వారం నుంచి అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీరోడ్డులోని హోట‌ల్ గేట్‌వే సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ‌ర్ షాబుల్ హాస‌న్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో త‌మిళ‌నాడు వంట రుచుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా షాబుల్‌హాస‌న్ మాట్లాడుతూ చెన్నై ఎక్స్‌ప్రెస్ ఫుడ్ ఫెస్టివ‌ల్ పేరిట ఏర్పాటు చేసిన డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తిరోజూ రాత్రి 7:30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌జా దోశ‌, మ‌సాల మిల‌గాయ్ బ‌జ్జీ, ప‌చ్చాయ్ ప‌ట్నీ వ‌డ‌, నెరికా ర‌సం, ముల‌గ ర‌సం, న‌వ‌త‌నియా సారు వంట రుచుల‌తో పాటు చికెన్ చెట్టినాడ్‌, చికెన్ నీల్‌గిరి కుర్మా, చికెన్ ప‌ల్లిపాయ‌లమ్‌, క‌దంబ మసాల వంటి నాన్‌వెజ్ ర‌కాలు, క్యాలీఫ్ల‌వ‌ర్ చెట్టినాడ్‌, సొర‌కాయ్ కుట్టు, ప‌కోడా కార త‌దిత‌ర వెజ్ కూర‌లు, ఐస్‌క్రీమ్‌లు, మిఠాయిలు వంటి చెన్నై సంప్ర‌దాయ రుచులు డిన్న‌ర్‌లో వండివారుస్తామ‌న్నారు. ఆయా ఆహార‌ప‌దార్థాల‌న్నీ హోట‌ల్‌లోని చీఫ్ చెఫ్ వేణుగోపాల్ ఆధ్వ‌ర్యంలో రూపొందిస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో హోట‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సుమ‌న్ జీ తివారీ, ఫుడ్ అండ్ బేవ‌రేజ్ మేనేజ‌ర్ ర‌మ‌ణ‌మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. న‌గ‌ర‌వాసులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

gateway_21-08-17_3 gateway_21-08-17_2 gateway_21-08-17_1

Just In...