Published On: Sun, Sep 19th, 2021

విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేత

విజయవాడ, సెల్ఐటి న్యూస్,: నగరంలోని మారుతీ నగర్ లోని సుదర్శన్ మాస్టర్స్ అకాడమీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలలో విజయాన్ని సాధించి ఉద్యోగం సంపాదించడానికి అన్ని రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం SSC, MTS విద్యార్థులకు ఆదివారం మోడల్ పరీక్ష (SUDARSAN MASTER’S ACADEMY “APP”లో) నిర్వహించారు. ఇందులో కాకినాడ నుంచి వచ్చి కోచింగ్ తీసుకుంటున్న సాయికృష్ణ, సాయి స్రవంతి, విజయవాడ నగరానికి చెందిన శివరామకృష్ణ అనే విద్యార్థులు విజయం సాధించారు. ఈ విద్యార్థులకు ప్రధమ బహుమతిగా రూ.2000, ద్వితీయ బహుమతిగా రూ.1000, తృతీయ బహుమతిగా రూ.500 నగదును ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ విద్యార్థులను డా.BR. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ డా.వెలగా జోషి, యుగంధర్, విశాలాంధ్ర దినపత్రిక బ్యూరో చీఫ్ చావా రవి, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఇలా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ఇలా కష్టపడి చదివి విద్యార్థులందరూ పరీక్షలలో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని సుదర్శన్ మాస్టర్ గారు విద్యార్ధులకు సూచించారు. అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఇక్కడ కోచింగ్ ప్రారంభం అయింది. కావున ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Just In...