Published On: Mon, Mar 11th, 2019

విద్యార్థులు గ్రంథాల‌య వ‌న‌రుల‌ను వినియోగించుకోవాలి..

* ‘ఆల్ యు నీడ్ ఈజ్ జ‌స్ట్ ఎ సెకండ్’ పుస్త‌క స‌మీక్ష‌లో వ‌క్త‌లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌: గ్రంథాల‌యాల్లో నిక్షిప్తమైన పుస్త‌కాల‌ను అభ్య‌సించ‌డం అనంత‌మైన ద్వారా విజ్ఞానాన్ని స‌ముపార్జించ‌వ‌చ్చ‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. విజ‌య‌వాడలోని మొగ‌ల్రాజ‌పురంలో ఉన్న పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌లోని గ్రంథాల‌య విభాగం ఆధ్వ‌ర్యంలో ర‌చ‌యిత‌తో ముఖాముఖి – పుస్త‌క విశ్లేష‌ణ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం ఉద‌యం క‌ళాశాల సెమినార్ హాల్‌లో నిర్వ‌హించారు. పుస్త‌క స‌మీక్ష‌లో యువ ర‌చ‌యిత్రి, బ్లాగ‌ర్ మ‌రియు జ‌ర్న‌లిస్ట్ దివ్య వ‌ల్ల‌భ‌నేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దివ్య ర‌చించిన ‘ఆల్ యు నీడ్ ఈజ్ జ‌స్ట్ ఎ సెకండ్’ పుస్త‌కాన్ని విద్యార్థినులు సాయి గ్రాయ‌త్రి, త‌నూజ‌, సంక్రితిల‌తో స‌మీక్ష చేయించి వారితో వివ‌రింప‌జేశారు. అనంత‌రం యువ ర‌చ‌యిత్రి దివ్య వ‌ల్ల‌భ‌నేని మాట్లాడుతూ త‌న ర‌చ‌న‌లో జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకొని యువ‌త‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ర‌చించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఎవ‌రికైనా జీవితంలో ఒక సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే దానికి స్పందించ‌డం కాకుండా ఒక్క క్ష‌ణం దానిని వేరే కోణంలో విశ్లేషించ‌డ‌మే త‌న పుస్త‌కంలోని ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన క‌ళాశాల డీన్ ప్రొఫెస‌ర్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ యువ‌త‌రానికే కాకుండా అన్ని వ‌య‌సులో వారికి దివ్య ర‌చించిన పుస్త‌కంలోని అంశాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని అందులో ఉన్న సంప‌ద‌ను మ‌న కోసం ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ఉపాధిక‌ల్ప‌న అధికారి కావూరి శ్రీధ‌ర్ మాట్లాడుతూ విద్యార్థులు నిరంత‌రం అందుబాటులో ఉన్న గ్రంథాల‌య వ‌న‌రుల‌ను వినియోగించుకోవాల‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇటువంటి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ఆలోచ‌న‌లు స్ఫుర‌ణ‌కు వ‌స్తాయ‌ని సూచించారు. గ్రంథాల‌య అధికారిణి కె.వాణిశ్రీ మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు 20 పుస్త‌కాల‌కు స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. విద్యార్థుల్లో రీడింగ్ అల‌వాటు పెంపొందించాల‌న్న ముఖ్య ఉద్దేశంతో పుస్త‌క స‌మీక్ష కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్‌, ఆంగ్ల‌ విభాగాధిప‌తి డాక్ట‌ర్ శ్రీల‌త‌, లెక్చ‌ర‌ర్ ఇన్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ డాక్ట‌ర్ ఎన్‌.శ్రీనివాస‌రావు, అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Just In...