Published On: Mon, Nov 19th, 2018

విద్యుత్ షాక్‌తో పైబ‌ర్ నెట్ కార్మికుడు మృతి

* మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

* కృష్ణా జిల్లా ఉల్లిపాలెంలో విషాదం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని ఉల్లి పాలెంలో విషాదం నెల‌కొంది. గ్రామంలో ఎపి ఫైబర్ వర్క్ చేస్తున్న ఇద్ద‌రు యువకులు విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ నెల 21న‌ ఉల్లిపాలెం గ్రామంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామదర్శిని కార్యక్రమానికి హజరుకానున్నారు. ముఖ్యమంత్రి  గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇంటింటికి నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ఫైబర్ నెట్‌కు చెందిన సిబ్బంది పనులు చేస్తున్నారు.  ఈ క్ర‌మంలో కరెంటు స్తంభంపై నుంచి పనులు చేస్తున్న ఇద్దరు ఫైబర్ నెట్ కేబుల్ కార్మికులు షాక్ తగిలి కింద పడిపోయారు. ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మరో ఇద్దరిని అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. స‌మాచారం అందుకుని అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్‌లో క్షతగాత్రులను ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప‌రామ‌ర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం నెల‌కొంది.

Just In...