Published On: Sun, May 24th, 2020

విధి నిర్వ‌హ‌ణ‌లో సేవా భావంతో ముందుకు సాగాలి…

* యువ ఐఏఎస్‌ల‌కు డీజీపీ గౌతమ్‌స‌వాంగ్ దిశానిర్ధేశం‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: 2019కి చెందిన 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో వారు శ‌నివారం మ‌మేక‌మ‌య్యారు. విధినిర్వ‌హ‌ణ‌లో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ యువ ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ అధికారులపైన  ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి అని, వారికి సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావంతో ముందుకు సాగాలని, ఐఏఎస్ అధికారుల బృందంలో మహిళలు ఎక్కువ శాతం ఉండటం అభినందనీయమన్నారు. అదేవిధంగా అంధత్వాన్ని జయించి ఐఏఎస్‌కు ఎంపికై విధుల్లో చేరబోతున్న ఆంధ్ర ప్రదేశ్‌కు  చెందిన కట్ట సింహాచలం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భ‌రోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశా చట్టం విధివిధానాలను వారికి వివరించారు. ]

Just In...