Published On: Mon, Apr 29th, 2019

వినియోగదారులకు రక్షణ కల్పించటమే లక్ష్యం..

* సౌత్ ఇండియా అధ్యక్షులు వనపర్తి కరుణాకర్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: వినియోగదారులకు రక్షణ కల్పించటమే అఖిల భారత వినియోగదారుల సంక్షేమ సంఘం లక్ష్యమని సౌత్ ఇండియా అధ్యక్షులు వనపర్తి కరుణాకర్ అన్నారు. విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులోని సోమవారం స‌మరం ఆసుపత్రి వద్దనున్న వాసవ్య మహిళా మండలి కార్యాలయంలో అఖిల భారత వినియోగదారుల సంక్షేమ సంఘం (ఆల్ ఇండియా కన్స్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్) సౌత్ ఇండియా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి, వినియోగదారులకు వారధిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సంఘానికి ప్రభుత్వ అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఈ సంఘం వినియోగదారులు నష్టపోకుండా సరైన అవగాహన కల్పించటంలో ముందుటుందని తెలిపారు. వినియోగదారుల రక్షక చట్టంను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక బాధ్య‌త‌గా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. వస్తు నాణ్యతలో కల్తీ జరగకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో అఖిల భారత వినియోగదారుల సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి డివియల్ పద్మావతి, రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ రెడ్డి, రాష్ట్ర సలహాదారులు కీర్తి, కార్యదర్శి వై.ఎన్.కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, కోశాధికారి వి.ప్రశాంత్, సలహాదారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Just In...