Published On: Wed, Feb 24th, 2021

వినియోగ‌దారుల న‌మ్మ‌క‌మే మా పునాది

* కొఠారి డైమండ్ జ్యూయ‌ల‌ర్స్ నూత‌న షోరూం ప్రారంభం

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌‌: శ‌తాబ్ధ కాలంగా బంగారు ఆభ‌ర‌ణాల విక్ర‌యాల్లో వినియోగ‌దారుల న‌మ్మ‌క‌మే పునాదిగా కొఠారి జ్యూయ‌ల‌ర్స్ నాణ్య‌మైన సేవ‌లు అందిస్తుంద‌ని కొఠారి డైమండ్ జ్యూయ‌ల‌ర్స్ అధినేత శ్రేజ‌స్ కొఠారి తెలిపారు. బుధ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ గురునాన‌క్ కాల‌నీ రోడ్డులో నూత‌న వ్యాపార శాఖ‌ను లాంఛ‌నంగా ప్రారంభించి ఆయ‌న మాట్లాడారు. బంగారు న‌గ‌ల‌తో పాటు ఫ‌రె‌వ‌ర్ పేరుతో వ‌జ్రాభ‌ర‌ణాలు కూడా త‌మ సంస్థ విక్ర‌యిస్తుంద‌ని వివ‌రించారు. నాణ్య‌త క‌ల్గిన బంగారు ఆభ‌ర‌ణాల‌ను మాత్ర‌మే కొ‌నుగోలు చేయాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో షోరూం మేనేజ‌ర్ ఎన్‌.వి.కృష్ణారెడ్డి, ప‌లువురు న‌గ‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

 

Just In...