Published On: Thu, Sep 26th, 2019

విపత్తు నిర్వహణపై పుస్తకావిష్కరణ…

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలు ఆయా శాఖల వారీగా 2030వ సంవత్సరం వరకు విపత్తు ప్రమాద స్థాయి తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రణాళికలను సమగ్రంగా, కూలంకుషంగా రూపొందించడం జరిగిందని విపత్తుల శాఖ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయం నాలుగవ బ్లాక్‌లోని ప్రధాన కార్యదర్శి వారి ఛాంబర్ నందు విపత్తుల తీవ్రత తగ్గింపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక (రోడ్ మ్యాప్) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు ఎక్సైజ్ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి డి.సాంబశివరావు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్తుల ప్రమాద స్థాయి తగ్గింపునకు రూపొందించిన రోడ్ మ్యాప్ లక్ష్యాలను ప్రభుత్వ శాఖలు పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా విపత్తులు సంభవించినప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Just In...