Published On: Fri, May 29th, 2020

విప‌త్క‌ర స‌మ‌యంలో పాత్రికేయుల సేవ‌లు అమూల్యం…

* నిత్యావ‌స‌రాలు విత‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అహోబిలం రామానుజ జీయర్ స్వామి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎపిజేఎ) ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సహకారంతో నిత్యం ప్రజలకి కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేస్తూ అనుక్షణం విధి నిర్వహణలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న నేపథ్యంలో విజయవాడ జర్నలిస్టు మిత్రులకు 10 కేజీల రైస్ ప్యాకెట్, కందిపప్పు,  ఆయిల్ ప్యాకెట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిదండి అహోబిలం రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ నిత్యం ప్రజలకి, ప్రభుత్వానికీ వారధిగా పనిచేస్తూ ఉత్తమ సేవలను అందిస్తున్నారని అలాగే దేశంలో కరోనా మహమ్మారీ ఉంజృంబిస్తున్న నేపథ్యంలో ప్ర‌ముఖులు గోకరాజు గంగరాజు, వారి కుమారుడు రంగరాజు, పేదలకి ప్రతిరోజు అన్నదానం చేయటం అలాగే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని పేర్కొంటూ వారి సేవలు గొప్పవని కొనియాడారు.
ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చందన మధు మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలు ఎలా ఉంటాయో తమకు తెలుసని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిరంతరం వార్త సమాచారాన్ని అందించటంలో జర్నలిస్ట్ లు ముందుంటారని ఈ కరోనా వైరస్ ప్రజలకి ప్రబలకుండా అవగాహన కలిపించేవిధంగా జర్నలిస్ట్ సేవలు అమోఘమని తెలిపారు. అందుకే వారికి ఈ నిత్యావసర వస్తువులు పంపిణి చేయాలనీ రఘు స్వామి ఆధ్వర్యంలో చిన్న జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిని సంప్రదించగా సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వారికీ పంపిణి చేయటంలో ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపి ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్‌గా జర్నలిస్ట్ సేవలు గొప్పవని, అలాగే చాలామంది జర్నలిస్టులు ఉన్నారని వారికీ ఎలాంటి గుర్తింపు కూడా లేకుండా ఉన్నారు. జీతభత్యాలు ఉండట్లేదని వారిని వెంటనే ప్రభుత్వం  నగదు రూపంలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స‌మాచార శాఖ అసిస్టెంట్ డైరె‌క్ట‌ర్ సదారావు గౌర‌వ అతిథిగా హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో ‌ఆలయ అర్చకులు, నిర్వాహకులు గుదిమెళ్ళ రఘునాథ్,  ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు సర్వారావు, శ్రీనివాస్, రామకృష్ణ, పూర్ణ, పండు, ఓంకార్, సంతోష్, లక్ష్మణ్, శివ, సునీల్, జోజి  తదితరులు పాల్గొన్నారు.  

Just In...