Published On: Fri, Mar 20th, 2020

విల్లా లిఫ్ట్‌, హైస్పీడ్ లిఫ్టుల‌ను ఆవిష్కరించిన జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్..

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: జాన్సన్ లిప్స్ అండ్ ఎస్కలేటర్స్ సంస్థ ఆధ్వర్యంలో మార్కెట్లోకి విల్లా లిఫ్ట్, హై స్పీడ్ లిఫ్ట్‌లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ కంట్రీ హెడ్ ఆల్బర్ట్ ధీరవియం తెలిపారు. ఎం.జి.రోడ్డులోని హోటల్ గేట్ వేలో గురువారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈనందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో 25 సంవత్సరాలుగా జాన్సన్ లిఫ్ట్ సేవలను అందిస్తుందన్నారు. కొత్తగా సింగల్ ఫేజ్ మీద నడిచే  విల్లా లిఫ్ట్ ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. 20 ఫోర్లకు పైగా ఉన్న బహుళ అంతస్థుల భవనాలకు • హై స్పీడ్ లిఫ్ట్ ‘ను ప్రవేశ పెట్టిన్లు తెలిపారు. విజయవాడ చుట్టుప్రక్కల గల ప్రభుత్వ ప్రాజెక్టులలో 120కి పైగా లిఫ్ట్ లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో హోటళ్లు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలలో జాన్సన్ లిప్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుందని తెలిపారు. నూజివీడులోని ఐఐఐటి, ఎపి సచివాలయం, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ( సిఆర్‌డిఎ), విజయవాడ, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, కడప, అనంతపురం, నెల్లూరులలో ప్రభుత్వ ఆసుపత్రులలో జాన్సన్స్ లిఫ్ట్ 17 లిఫ్టులను ఏర్పాటుచేసిందని తెలిపారు. విజయవాడలో కార్యకలాపాలు ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాన్సన్ లిఫ్ట్ ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా 575 మంది నమ్మకమైన సిబ్బందితో విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మూడు కార్యాలయాలను కలిగిఉందని తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ మేనేజర్ పి.చైతన్య, విజయవాడ బ్రాంచి మేనేజర్ యు.ఎన్.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Just In...