Published On: Mon, Jun 25th, 2018

వివాహం ఇష్టం లేక యువ‌తి అదృశ్యం

* పోలీసుల‌కు తండ్రి ఫిర్యాదు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ నేర‌వార్త‌లు: వివాహం ఇష్టం లేక యువతి అదృశ్యమైన సంఘటన విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి కసర్ సింగ్ సింగ్‌నగర్‌లో నివాసముంటున్నారు. తన కుమార్తె కిరణ్ కౌర్(24) గత ఐదు రోజులుగా కనిపించడంలేదని పేర్కొంటూ ఆయ‌న సోమ‌వారం సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేయాలని నిర్ణయించామని దీంతో కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు రోజులలైనా తమ కుమార్తె ఆచూకీ ల‌భించ‌క‌పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సింగ్‌నగర్ సీఐ జగన్మోహనరావు తెలిపారు. యువతి స్నేహితులని ఆరా తీయగా ఎటువంటి ప్రేమ వ్యవహారం వెలుగు చూడలేదని తెలిపారు. కేవలం వివాహం ఇష్టం లేకే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదైనా ప్రైవేట్‌ హాస్టట్‌లో తలదాచుకొని ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Just In...