Published On: Tue, Mar 9th, 2021

విశాఖపట్నం ఏపీకి దొరికిన కోహినూర్ వజ్రం

* పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆర్థిక, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టగల నగరం విశాఖ. దీర్ఘకాలిక పారిశ్రామిక అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం లక్ష్యం అని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మ‌త్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం సచివాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఓ ఫారెల్ బృందంతో మంత్రి స‌మావేశ‌మ‌య్యారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల విశ్వాసం పెంచడమే మా ప్రభుత్వ విధానం. ప్రపంచమంతా ‘ఆటోమేషన్’ విస్తరించినా నైపుణ్య మానవవనరులు కూడా అవశ్యమన్న మంత్రి గౌతమ్ రెడ్డి. ముఖ్యమంత్రి, మంత్రి ఆలోచన విధానాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా హై కమిషనర్ ఓ ఫారెల్. పారిశ్రామిక రంగ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికిగల స్పష్టత చూసి ముగ్ధులయ్యామన్న ఆస్ట్రేలియా ప్రతినిధులు. ఎలక్ట్రానిక్ వెహికల్, బ్యాటరీ తయారీ రంగాలలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నామన్న చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సులేట్ సారా సులభతర వాణిజ్యం, తక్కువ ఖర్చుతో వాణిజ్యం అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 పోర్టులు, 6 ఎయిర్ పోర్టులు, 30 నైపుణ్య కళాశాలలు, ఐ.టీ , ఎలక్ట్రానిక్ స్కిల్ యూనివర్శిటీ, రహదారుల అనుసంధానం తదితర మౌలిక సదుపాయాలపై దృష్టి. 51వేల అప్లికేషన్లను అతి తక్కువ సమయంలో పరిశీలించి అనుమతులు ఇచ్చాం. 97.8శాతం 21 రోజులలో పూర్తి. రాష్ట్రంలో తయారీ  రంగానికి సంబంధించిన 10 ప్రాంతాలను గుర్తింపు. చౌకగా వ్యాపారం మా ప్రత్యేకత అంటూ పవర్ ప్రజంటేషన్ ద్వారా ఆస్ట్రేలియా ప్రతినిధులకు వివరించిన ఈడీబీ సీఈవో డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే 25 శాతం కార్మికుల వ్యయం , విద్యుత్ 20 శాతం ఖర్చు తక్కువ. కీలక రంగాలు, ప్రాధాన్యతనిచ్చిన ప్రాంతాలు, అవకాశాలపై ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీలు, మైనింగ్, మౌలికసదుపాయాలలో  భాగస్వామ్యానికి ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉన్నట్లు మంత్రికి వెల్లడించిన ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది. తిరుపతి, విశాఖ, అమరావతి కేంద్రంగా ఐ.టీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ తెలిపారు. ఐ.టీ పాలసీలో మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఆంధ్రప్రదేశ్ లోని 15వేలకు పైగా గ్రామాలకు రాబోయే 3 ఏళ్లలో ఇంటర్నెట్ అందించాలన్నదే లక్ష్యం. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కు మరింత ప్రాధాన్యత. గ్రామీణ స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు, వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు. ఫాక్స్ గాన్, టీసీఎల్ తదితర పేరున్న సంస్థలకు నెలవు ఏపీ. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తిలో వైఎస్ఆర్ ఈఎమ్సీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి. టెక్నాలజీ, సేవా రంగాలలో ఆర్థికంగార ఆస్ట్రేలియా భాగస్వామ్యం చాలా ఎక్కువ. ప్రోత్సాహకాలు అందించే విషయంలో పారదర్శకతకు పెద్దపీట, దీనిపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత. కాన్సెప్ట్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యానికి, ఏపీలో లిథియం ఆధారిత బ్యాటరీల తయారీలో ఆస్ట్రేలియా తోడ్పాటుకు అవకాశాలున్నాయి. సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా, ఆస్ట్రేలియా ఫస్ట్ సెక్రటరీ (పొలిటికల్) సంగాని, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈడీబీ అధికారులు పాల్గొన్నారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ సునీల్‌ వాచని, డిక్సన్‌ టెక్నాలజీస్‌ సీఈవో పంకజ్‌ శర్మ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మంగ‌ళ‌వారం తాడే‌ప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. 

Just In...