Published On: Sun, Jun 28th, 2020

విశాఖలో భారీగా నగదు పట్టివేత

విశాఖ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విశాఖలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో భారీగా నగదు పట్టుబడింది. బ్యాగ్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడి చేసి నగదును పట్టుకున్నారు. బ్యాగులో రూ.50.38 లక్షలు నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబందించి తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణంకు సంబందించిన యజమాని ప్రవీణ్‌కుమార్ జైన్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న న‌గ‌దును ఆదాయ ప‌న్ను శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు.

 

Just In...