Published On: Mon, Nov 18th, 2019

విశాఖ అందాలు అద‌ర‌హో…!

* బాలీవుడ్ న‌టీమ‌ణి అర్షి శ్రీవాత్స‌వ

సెల్ఐటి న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం: దేశంలోని ఎన్నో ప్రాంతాల‌లో షూటింగ్‌ల నిమిత్తం వెళ్లిన‌ప్పుడు క‌ల‌గ‌ని ఆహ్ల‌దం, ఆనందం విశాఖ అందాలు చూశాక మ‌న‌సు ప‌రవ‌శించింద‌ని బాలీవుడ్ న‌టీమ‌ణి అర్షి శ్రీవాత్స‌వ అన్నారు. ఓ వాణిజ్య సంస్థ బ్రాండింగ్‌తో పాటు ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం సోమ‌వారం విశాఖ న‌గ‌రానికి విచ్చేసిన అర్షి శ్రీవాత్స‌వ విశాఖ అందాల‌ను ఎంతో ముగ్ధుల‌య్యారు. గూగుల్‌లో బెస్ట్ బ్యూటీఫుల్ సిటీస్‌లో విశాఖ‌ప‌ట్నం చూసిన తాను ఎప్ప‌టి నుండో ఇక్క‌డ‌కు రావాల‌ని అనుకున్న‌ట్లు చెప్పారు. బ్రాండింగ్ మ‌రియు సినిమా నిమిత్తం ఇలా వ‌చ్చే అవ‌కాశం ఇప్ప‌టికి క‌లిగింద‌ని, సిటీతో పాటు విశాఖ ప‌రిస‌ర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌ల‌కు విశాఖ ఎంతో అనువైన ప్రాంత‌మ‌ని, బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో తాను ఇక్క‌డి సోయ‌గాల‌ను చ‌ర్చించి బాలివుడ్ త‌ర‌ఫున ప‌లు చిత్రాల‌కు సంబంధించి షూటింగ్‌లు జ‌రిగేలా చ‌ర్చిస్తాన‌న్నారు. తిల్లి, బాబుమ్ ముజే బందూకాబ‌జ్‌, కెకె-100 వంటి చిత్రాల‌తో పాటు ఇత‌ర భాష‌ల చిత్రాల్లో న‌టించిన తాను 2017 ఆయుష్మాన్ మిస్ ల‌క్నోగా ఎన్నికైన‌ట్లు తెలిపారు. తెలుగు చిత్రాల్లో న‌టించాల‌న్న త‌న క‌ల రీసెర్చ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద్వారా సాకారం కావ‌డం ఎంతో  సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని వెల్ల‌డించారు.

Just In...