Published On: Wed, Mar 6th, 2019

విశాఖ మెట్రోకు కొరియా ఎగ్జిం బ్యాంకు రూ.4,100 కోట్ల ఋణం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విశాఖపట్నంలో నిర్మించనున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల ఋణం సమకూర్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ మేరకు బుధవారం కొరియా ఎగ్జిం బ్యాంకు ఆపరేషనల్ డైరెక్టర్ యాంగ్ డాంగ్ చోలే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు ఎండి రామకృష్టారెడ్డితో అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను కలిసింది. విశాఖ మెట్రోకు ఋణం మంజూరుకు ఇతర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి పంపగా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు కొరియా ఎగ్జిం బ్యాంకుకు పంపగా ఆ బ్యాంకు రూ.4,100 కోట్లు మంజూరుకు ముందుకు వచ్చిన నేపధ్యంలో ఈ ప్రతినిధుల బృందం ఇక్కడకు రావడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ మెట్రోకు ఋణం మంజూరు అందుకు అవసరమైన విధి విధానాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు వివరాలు, ఇతర డాక్యుమెంటేషన్ల ప్రక్రియను పూర్తిచేసి ఇవ్వడం జరుగుతుందని సకాలంలో ఋణం మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి పునేఠ బ్యాంకు అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రోరైలు నిర్మాణంపై అత్యంత ఆసక్తిగా త్వరితగతిన మెట్రోరైలు ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఉందని ఈ క్ర‌మంలో స‌కాలంలో ఋణం మంజూరు సహకరించాలని సిఎస్ పునేఠ ఎగ్జిం బ్యాంకు అధికారులను కోరారు.

Just In...