Published On: Wed, Dec 5th, 2018

విశిష్ట ప్రతిభావంతులకు నేషనల్ ఫెలోషిప్ అవార్డ్స్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అంతర్జాతీయ సామజికవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉద‌యం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశిష్ట ప్రతిభావంతులకు మదర్ థెరిస్సా నేషనల్ ఫెలోషిప్ అవార్డ్స్-2018 ను ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు ఘంటా విజయ్‌కుమార్ సభాధ్యక్షులుగా వ్యవహరించ‌గా ముఖ్య అతిధులుగా గుంటూరు శాసన సభ్యులు ఫిలిప్ సి.తోచర్ విచ్చేశారు. కార్యక్రమంలో సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సదారావు, ఏపీ.ఎన్.ఆర్.టి డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్, అభ్యుదయ కవి, రచయిత యడవల్లి శ్రీనివాసరావు, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు మేదర సురేష్‌కుమార్, కరుణా ఐ బ్యాంక్ వ్యవస్థాపకులు ధారా కరుణశ్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...