Published On: Tue, Oct 15th, 2019

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

* లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డి వీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం జూనియర్ అసిస్టెంట్‌ సూర్యభగవాన్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎమ్‌సీ) పటమట సర్కిల్ పరిధిలోని మూడు కార్యాల‌యాల్లో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మెరుపుదాడి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యభగవాన్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇంటిపన్నులో పేరు మార్చడానికి సూర్య భగవాన్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సూర్య భగవాన్‌ను ట్రాప్‌ చేసి పట్టుకున్నారు.  రూ.9వేల నగదు స్వాధీనం చేసుకొని అతడిని కస్టడీలోకి తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ కనకరాజులు పాల్గొన్నారు.

Just In...