Published On: Thu, Feb 13th, 2020

వెండితెరపై నవ తార.. మాయ సాహు..

హైద‌రాబాద్‌, సెల్ఐటి న్యూస్‌: వెండితెరపై వెలుగులు విరజిమ్మేందుకు ఓ నవ తార దూసుకొచ్చింది. మెరుపు లాంటి చిరునవ్వు, ముగ్ధ మనోహరమైన సౌందర్యానికి తోడు ప్రేక్షకులను సమ్మోహనపరిచే అభినయం ఆమె సొంతం. తన తొలి చిత్రం ‘లవ్ దివానా’తో ప్రత్యేకతను చాటుకున్న అందాల సుందరి మాయ సాహు మరో రెండు బహుభాషా చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. తన అందచందాలతో బాలీవుడ్, భోజ్ పురి, ఛాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. కళకు హద్దులు లేవంటున్న మాయ.. త్వరలో తెలుగు తెరపై సందడి చేస్తానంటోంది. లవ్ దివానా ద్వారా విజయాన్నందుకున్న ఈ రాయ్‌పూర్ అమ్మాయి అభినయానికి ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ప్రాధాన్యతనిస్తానని చెప్తోంది. మాయ సాహు అందాల మాయలో చిక్కుకుని ఆనందించేందుకు దక్షిణాది ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారనే చెప్పొచ్చు.

Just In...