Published On: Fri, May 22nd, 2020

వెహికిల్ ట్యాక్స్ మారిటోరియం గడువు పెంచండి

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు, సెల్ఐటి న్యూస్‌: లాక్‌‌డౌన్ వల్ల ఆదాయం లేక చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. లాక్‌డౌన్ వల్ల టాక్సీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఇతర వర్కర్లు పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఈ సంక్షోభ సమయంలోనూ వాహనదారులు ట్యాక్స్ కట్టాలంటే చాలా ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. వెహికిల్స్ ట్యాక్స్‌ల మీద జూన్ వరకు ఉన్న మారిటోరియంను ఆగస్టు వరకు పొడిగించాల‌ని సీఎంను కోరారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో మారిటోరియం పొడిగింపు కాస్త ఊరటనిస్తుందన్నారు.

Just In...