Published On: Fri, Jun 26th, 2020

వైఎస్సార్ వాహన మిత్ర గడువు పొడిగింపు

* డిటీసీ వెంకటేశ్వరరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అర్హత కలిగిన ప్రతి డ్రైవరుకు వాహన మిత్ర ఆర్థిక సహయం అందాల, మాకు అందలేదు అని ఎవ్వరు చెప్పకూడదు, అర్హత గల ప్రతి డ్రైవరుకు ఆర్థిక భరోసా గా 10వేల రూపాయలు అదించి, చేయుతనివ్వాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా కలిగి వాహనం నడుపుకుంటున్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకొనుటకు గాను మరల వైఎస్‌ఆర్ వాహన మిత్ర గడువు తేదీని ఈ నెల 26వ తారీఖు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీచేసిందని డిటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక డిటీసీ కార్యాలయంలో గురువారం నాడు డిటీసీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొదటి దశలో దరఖాస్తు చేసుకోలేని అర్హత గల లబ్ధిదారులకు దరఖాస్తులను అప్‌లోడ్ చేయడానికి ఈ నెల 26వ తేదీ వరకు సమయాన్ని ఇవ్వడం జరిగిందని. ఆయన తెలిపారు. అప్లోడ్ చేసిన దరఖాస్తులను ఎంపిడిఓ / మునిసిపల్ కమిషనర్లు ఈ నెల 28లోగా పరిశీలించి, జిల్లా కలెక్టరుకు సిఫారసు చేస్తారని. అర్హత కలిగిన లబ్ధిదారులను జూలై 1 తేదీలోగా కలెక్టరు ఆమోదం తెలుపుతారని ఆయన తెలిపారు. జూలై 4 తారీఖు లోగా ఆర్థిక సహాయం విడుదల చేయ‌డం జరుగుతుందన్నారు. అర్హతగల లబ్ధిదారులందరికీ ఆర్థిక సహాయంగా 10వేల రూపాయలను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోకి జమచేయడం జరుగుతుందని డిటీసీ తెలిపారు.  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిటీసీ కోరారు.

Just In...