Published On: Fri, Feb 14th, 2020

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

అమరావతి, సెల్ఐటి న్యూస్ క్రైం : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారించింది. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై ఈ నెల 20కి వాయిదా పడింది. అడ్వకేట్ జనరల్‌ లేకపోవడంతో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. హత్య జరిగి ఏడాది అవుతున్నా ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. హత్య చేసి, రక్తపు మరకలు తుడిచివేయడం జరిగినా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు డ్రైవర్‌ను అరెస్ట్ చేయలేదు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ అన్నారు. సీఎం అయ్యాక ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నార‌ని పిటిషనర్‌ తన వాదనను కోర్టుకు వినిపించారు. అయితే ఇందుకు స్పందించిన న్యాయమూర్తి.. ఇతరుల పిటిషన్‌ విషయాలు ప్రస్తావించవద్దని పిటిషనర్‌కు సూచించారు. తమ పిటిషన్ వరకు మాత్రమే మాట్లాడాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. సీబీఐకి ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా..? కౌంటర్ వేస్తారా..? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కౌంటర్ వేయమని న్యాయవాది స్పష్టం చేశారు.

Just In...