Published On: Tue, Jun 18th, 2019

వైకాపా గురించి మాట్లాడే అర్హ‌త తెదేపాకి లేదు

* గ‌తంలో మహిళా అధికారిణిని చెంప మీద కొట్టినా ప‌ట్టించుకోని ప‌రిస్తితి

* ఏపీ హోమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ చేయడంపై ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందిచారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మహిళా అధికారిణిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి అప్పట్లో ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. అన్యాయాన్ని నిలదీసినందుకు తమ పార్టీ ఎమ్యెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని, వైకాపా గురించి మాట్లాడే అర్హత తెదేపాకి లేదని ఆమె దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో తెదేపా వాళ్ళు 44 మంది గాయపడితే వైకాపా వాళ్ళు 57 మంది గాయపడ్డారని సుచరిత అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగితే.. దానిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించవద్దని సీఎం ఇదివరకే చెప్పారని హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.

Just In...