Published On: Wed, Jul 29th, 2020

వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ.1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ.70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల‌ను వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Just In...