Published On: Tue, Apr 6th, 2021

వైభ‌వంగా శ్ర్రీవారి అభిషేకం…

* ఘ‌నంగా ప్రారంభ‌మైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

తాడేప‌ల్లి(గుంటూరు జిల్లా), సెల్ఐటి న్యూస్‌: విజయకీలాద్రి దివ్యక్షేత్రం కొండ క్రింద కొలువు తీరిన‌ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమ‌వారం వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మాల్లో భాగంగా మొదటి రోజైన సోమ‌వారంనాడు వెంకటేశ్వరస్వామి వారికి అభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వ‌హించారు. కార్యక్రమంలో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని స్వామివారిని ద‌ర్శించుకుని తీర్థ‌ప్ర‌సాదాలు అందుకున్నారు.

Just In...