Published On: Sat, May 18th, 2019

వైసిపి పాపాలు బట్టబయల‌య్యే సమయం వచ్చింది

* ఎ1, ఎ2 ముద్ధాయిలు తీహర్ జైలుకే

* చంద్రగిరి రీ పోలింగ్ కుట్రలో భాగమే

* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఎ2 ముద్ధాయి విజయసాయిరెడ్డి, కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) చేసిన పాపాలు బట్టబయల‌య్యే సమయం ఆసన్నమైందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ నెల 23వ తేదీ అనంతరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని, ఆ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పీకే ఈవిఎంలు కొన్ని గంటల పాటు పని చేయవని వైసిపి నాయకులతో చెప్పడమే కుట్రలు జరిగాయనే విషయాన్ని స్పష్టం చేస్తుందని తెలిపారు. బెల్ సంస్థ ఇవిఎంల నిర్వహణ, రీ ప్లేస్మెంట్ బాధ్యతను ఏ ఎజన్సీకి అప్పగించింది, ఆ ఏజన్నీ నిర్వహణ, రీ ప్లేస్మంట్ కు అంత జాప్యం ఎందుకు చేసిందనే అంశాలను తేల్చాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జగన్ రూ.300 కోట్లు చెల్లించి పీకేను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని చెప్పారు. తుని రైలు ఘటన నుంచి ఈవిఎంలు సక్రమంగా పని చేయని సంఘటన వరకూ పీకే పాత్ర స్పష్టమవుతుందన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఆశయంతో పోలింగ్ రోజు ఓటర్లు ఈవిఎంలు పని చేయకపోయినా, మరుసటి రోజు తెల్లవారుజాము వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. అవినీతిపరుల్ని అందలం ఎక్కించేందుకు చంద్రగిరిలో రీ పోలింగ్ కు 34 రోజుల అనంతరం ఆదేశించడం దారుణమన్నారు. కేంద్రంలోని మోడీ, షా ప్రభుత్వం దొంగల పార్టీతో చేతులు కలిపి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందన్నారు. ఎన్నికలు జరిగిన ఒకటి, రెండు రోజుల్లో రీ ఫోలింగ్ కు ఆదేశించడం సాధారణంగా జరుగుతుందన్నారు. ఈ నెల 23న అనంతరం రాష్ట్రంలో వైసిపి, కేంద్రంలో ప్రధాని మోడీ తమ దుకాణాలు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వైసిపి ఓటమి ఖాయమని గ్రహించిన కేసిఆర్ ఆ పార్టీ దుకాణాన్ని హైదరాబాదు నుంచి తొలగించాలని జగన్ ను ఆదేశించారని, దీంతో లోటస్ పాండ్ ను వైసిపి ఖాళీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ కేసిఆర్ వైసిపిపై రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని, కేంద్రంలో కొత్త ప్రభుత్వం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వైసిపిని అక్కడి నుంచి పంపేస్తున్నాడని చెప్పారు. అమరావతికి వస్తున్న వైసిపి చేసే కుట్రలు, కుతంత్రాలు పోలీసులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని కోరారు. పోలింగ్ పూర్తయిన అనంంతరం విచ్చల విడిగా పందాలు కాశారన్నారు. ఓటమి ఖాయమవడంతో మళ్లీ తిరుగు పందాలు వైసిపి నాయకులు కాసినట్లు చెప్పారు. వివిధ సంస్థల పేరుతో కొంత మంది మాజీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి ప్రాజెక్టు సైట్లో కేవలం 45 నిముషాలు కూడా ఉండలేదన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోకుండా రాజమండ్రి వెళ్లి విలేకర్ల సమావేశం నిర్వహించి పోలవరంలో అవినీతి చోటు చేసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ డైరెక్షన్లో ఈ డప్పుబ్యాచ్ నడుస్తోందన్నారు. ఈ నెల 23 అనంతరం జగన్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గత ఎన్నికల అనంతరం ఫలితాలు చూసి తట్టుకోలేక టి.వి పగలగొట్టినట్లు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. జిత్తులమారి నక్క కేవిపి ఢిల్లీలో కూర్చుని లేఖలు రాస్తోందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు రూ.4,716 కోట్ల గురించి ప్రధాని మోడీకి, ఎన్జీటిలో, సుప్రీం కోర్టులో కేసులు వేయడం, బ్యాక్ వాటర్ స్టడీస్ పేరుతో పోలవరాన్ని అడ్డుకోవాలని చూస్తున్న కేసిఆర్ కి లేఖలు రాయలేని కేవిపి చిత్తశుద్ధితో పోలవరాన్ని నిర్మిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఈయనపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని, టైటానియం దొంగగా కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పోలవరంపై కేవిపి, సంస్థల ముసుగులో విశ్రాంత ఐఎఎస్ అధికారులు చేస్తున్న విష ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. కాపర్ డ్యామ్ ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇసిఆఎఫ్ డ్యామ్ పనులు త్వరలో ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఈ పనులను 8 నెలల్లో పూర్తి చేయాడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పునరావాసం పనులు వేగవంతం చేయడానికి రెవిన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. డ్యామ్ సైట్ లో దేశ విదేశాలకు చెందిన ఇంజనీర్లు, కార్మికులు 46 డిగ్రీల ఎండలో సైతం కష్టించి పని చేస్తుంటే మానవత్వం లేకుండా బురద జల్లుతున్నారని చెప్పారు. వైసిని శిక్షణ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు కింద ఉంటే ఎ2 ముద్ధాయి వేదికపైన ప్రవచనాలు చెప్పడం చూస్తే పోలిట్ బ్యూరో పరిస్థితి ఏంటో అర్ధమయ్యిందన్నారు. ఫలితాల అనంతరం ఎ1, ఎ2 ముద్ధాయిలు ఇద్ధరికీ తీహార్ జైలే గతన్నారు. టిడిపితో విరోదం నిర్ణయంపై ఇప్పుడు మోడీ, అమిత్ షాలు కొట్టుకుంటున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్క‌ర్ ఊహించని దుర్మార్గాలను మోడీ, షా ధ్వయం చేసిందన్నారు. తెలుగు వారితో పెట్టుకున్నందుకు చరిత్ర హీనులుగా మారబోతున్నారని చెప్పారు.

Just In...