Published On: Mon, Jan 13th, 2020

వ్యాపార భాష కోసం మాతృభాషకు ద్రోహం చేస్తారా?

* విజ్ఞాన శాస్త్ర ఆవిష్కర్తల్లో అత్యధికులు ఆంగ్లేతరులే

* సైన్స్‌ను మాతృభాషలోనే బోధించాలన్న సి.వి.రామన్

* తెలుగు భాషా మాధ్యమ ఐక్యవేదిక దర్గాలో వి.వి.ఆర్. కృష్ణంరాజు

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ప్రాధమిక విద్యను మాతృభాష‌లో బోధించిన‌ప్పుడే విద్యార్థులు ప్ర‌తిభావంతులుగా మార‌తార‌ని ఎపి ఎడిట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వి.వి.ఆర్‌.కృష్ఱంరాజు అన్నారు. ప్రాధ‌మిక విద్యా స్థాయిలో ఆంగ్ల మాద్య‌మానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నాచౌక్‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మానికి హాజ‌రై శ‌నివారం ఆయ‌న సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆంగ్లం ఒక వ్యాపార కార్య‌క‌లాపాలు స‌జావుగా సాగ‌డానికి ఆంగ్లాన్ని వ‌ల‌స దేశాల్లో ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. ఒక వ్యాపార భాష కోసం మాతృభాష‌ను మృత‌ప్రాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌, భార‌త‌ర‌త్న స‌ర్ సి.వి.రామ‌న్ గ‌ణితం, విజ్ఞాన శాస్త్రాల‌ను కూడా మాతృభాష‌లోనే బోధిచాల‌ని నాడు సూచించార‌న్నారు. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు నేటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుల‌కు శిరోధార్యం కావాల‌న్నారు. ఆంగ్లంతోనే అభివృద్ధి సాధ్య‌మంటూ కొంద‌రు చేస్తున్న ప్ర‌చారంలో శాస్త్రీయ‌త లేద‌ని కృష్ణంరాజు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన ప‌ది దేశాల్లో రెండు మాత్ర‌మే ఆంగ్లాన్ని మాతృభాష‌గా క‌లిగి ఉన్నాయ‌న్నారు. వ్యూ రీసెర్చ్ సెంట‌ర్ స‌ర్వేలో ప్ర‌పంచంలోని వంద అత్యుత్త‌మ ఉత్త‌మ వైజ్ఞానిక ఆవిష్క‌ర‌ణ‌ల్లో 95 ఆంగ్లేతుల‌వేన‌ని తేలింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నోబెల్ సాహిత్య బ‌హుమ‌తుల‌ను 116 మందికి ఇవ్వ‌గా వారిలో 93 మంది ఆంగ్లేత‌రులేన‌ని తెలిపారు.
ఆంధ్రా ఆర్ట్స్ అకాడ‌మీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోళ్ల నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ ఆంగ్ల మాధ్య‌మంపై ప్ర‌భుత్వ వైఖరి మార‌క‌పోతే ఉధ్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రాధ‌మిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమ‌న్ని ప్ర‌వేశ‌పెట్ట‌మ‌ని ప్ర‌జ‌లెవ్వ‌రూ కోర‌లేద‌ని పేర్కొంటూ వైసీపీ పార్టీ కూడా త‌న మేనిఫెస్టోలో ఆంగ్ల మాధ్య‌మం గురించి ప్ర‌స్తావ‌న చేయ‌లేద‌ని గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో తెలుగు భాషోధ్య‌మ ప్ర‌చార‌క‌ర్త రామ‌తీర్థ, తెలుగు పండిత ప‌రిష‌త్ అధ్య‌క్షుడు గిరిరాజ్‌, దుర్గా నాగ‌మ‌ణి, కామినేని శైల‌జ‌, కోనేరు క‌ల్ప‌న‌, చింతా డూండీ కృష్ణ‌, చింతా రుషి, స్నిగ్ధ‌మాధ‌వి, రాజేష్‌, నారాయ‌ణ‌రావు త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.

Just In...